‘ముకుంద’ కి వస్తున్న పాజిటివ్ టాక్

‘ముకుంద’ కి వస్తున్న పాజిటివ్ టాక్

Published on Dec 21, 2014 3:05 AM IST

mukundar1
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ‘ముకుంద’ చిత్రంతో పరిచయం అవుతున్న సంగతి విదితమే. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 24న భారీ విడుదలకు సిద్దం అయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని ఈ చిత్రం యూనిట్ తెలిపింది. అంతేకాకుండా వరుణ్ తేజ్ కి ఈ చిత్రం పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ అని అంటున్నారు.

మిక్కి జె మేయర్ అందిచించిన మెలోడియస్ పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన అర్ధవంతమైన సాహిత్యం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని నల్లమలుపు బుజ్జి టాగోర్ మధు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు