మౌత్ టాక్ తో దూసుకుపోతున్న ‘పెళ్లి చూపులు’

Pellichoopulu
పోస్టర్లు, ట్రైలర్లతోనే ప్రేక్షకుల్ అటెంక్షన్ గెలుచుకుని విడుదలైన మొదటి షో నుండే మంచి సినిమా అన్న టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం ‘పెళ్లి చూపులు’. కొత్త దర్శకుడు ‘తరుణ్ భాస్కర్’ నేటి తరం ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, ఎలా కోరుకుంటున్నారు అన్నది సరిగ్గా క్యాచ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ రిఫ్రెషింగ్ ప్రేమ కథ ప్రస్తుతం విడుదలైన అన్ని మల్టీ ప్లెక్సులు, నగరాల్లో అద్భుతమైన ఆదరణను పొందుతోంది.

ఈ చిన్న సినిమా ఇంతటి ఆదరణను, పబ్లిసిటీని తెచ్చుకోవడానికి కారణం డి. సురేష్ బాబు గారి భిన్నమైన ఆలోచన. ఒక సినిమా జనాల్లోకి వెళ్లాలంటే అన్నిటికన్నా మంచి పాజిటివ్ మౌత్ టాక్ ముఖ్యమని భావించిన ఆయన విడుదలకు ముందే ప్రివ్యూలు రూపంలో సినిమాను విమర్శకులకు ధైర్యంగా ప్రదర్శించారు. సినిమా విమర్శకులను సైతం మెప్పించడంతో మంచి మౌత్ టాక్ మొదలై సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించారు.

 

Like us on Facebook