‘వైశాఖం’ కు పెరుగుతున్న పాజిటివ్ టాక్ !

‘వైశాఖం’ కు పెరుగుతున్న పాజిటివ్ టాక్ !

Published on Jul 24, 2017 1:33 PM IST


‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ వంటి చిత్రాల్ని రూపొందించిన మహిళా దర్శకురాలు బి. జయ తాజాగా డైరెక్ట్ చేసిన చిత్రం ‘వైశాఖం’. హరీష్‌, అవంతికలు జంటగా నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. మొదటి రోజు మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం శని, ఆదివారాల్లో మరింత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సినిమాకు మంచి ఆదరణ దక్కవుతోంది.

అంతేగాక ప్రముఖులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, టి. సుబ్బరామిరెడ్డి, జిఎమ్మార్ లు కుటుంబ సమేతంగా సినిమాను వీక్షించి, చిత్రం మానవతా విలువలను గుర్తుచేసే విధంగా ఉందని మెచ్చుకున్నారని వినికిడి. సినిమాలో ఆహ్లదకరమైన పాటలు, ఉత్కంఠమైన మలుపులు ఉండటంతో ఆడియన్స్ థ్రిల్ అవుతున్నారని, ఈ పాజిటివ్ టాక్ చిత్రానికి మరింత మైలేజ్ ఇవ్వడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్జే సినిమాస్ బ్యానర్ పై బిఏ రాజు గ్రాండ్ గా నిర్మించిన ఈ చిత్రానికి డీజె. వసంత్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు