‘సైరా’ లో ఒళ్ళు గగుర్పొడిచే డైలాగ్స్ చెప్పనున్న చిరు !
Published on Nov 3, 2017 4:57 am IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఈ పేరులోనే బోలెడంత ధైర్యం ప్రతిధ్వనిస్తుంటుంది. ఈయన పేరు ప్రస్తావిస్తే చాలు రేనాటి ప్రజల మాటల్లో ఆవేశం దొర్లుతుంది. అంతటి వీరుడి జీవిత చరిత్రనే ఇప్పుడు మెగాస్టార్ చిరు తన 151 వ సినిమాగా చేస్తున్నారు. అప్పటి ప్రజల జయ జయ ద్వానమైన సై సైరా నరసింహారెడ్డి నుండే చిత్రానికి ‘సైరా నరసింహారెడ్డి’ అనే పేరుని పెట్టారు.

ఇక నరసింహారెడ్డి పాత్రను తెరపై సజీవంగా ఆవిష్కరించాలంటే గంభీరమైన ఆహార్యంతో పాటు ఒళ్ళు గగుర్పొడిచే మాటలు కూడా ఉండాలి. అందుకే మేకర్స్ ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రాను ప్రాజెక్టులోకి తీసుకుని పవర్ ఫుల్ డైలాగ్స్ రాయిస్తున్నారట. సాయి మాధవ్ కూడా అప్పటి చరిత్రను కూలంకషంగా పరిశీలించి నరసింహారెడ్డి పౌరుషం ఉట్టిపడేలా మాటలు రాస్తున్నారట.

మరి ఇంతటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉన్న చిరు నరసింహారెడ్డి అవతారంలో చెబుతుంటే ప్రేక్షకుల్లో ఊపు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

 
Like us on Facebook