‘పైసా వసూల్’ నిండా పంచ్ డైలాగులేనట !
Published on Jul 10, 2017 8:52 am IST


నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘పైసా వసూల్’. బాలకృష్ణ తన రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా పూర్తి స్థాయి కమర్షియల్ ఫార్మాట్లో చేస్తున్న ఈ సినిమా పట్ల మంచి అంచనాలున్నాయి. అందుకే పూరి కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాను అభిమానులు మెచ్చే విధంగా రూపొందిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా బాలకృష్ణ నుండి ఫ్యాన్స్ ఎక్కువగా ఆశించే పంచ్ డైలాగులు కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉంటాయట.

ఎలాంటి డైలాగునైనా అలవోకగా చెప్పగలిగే బాలకృష్ణకు పూరి రాసిన పవర్ ఫుల్ పంచ్ డైలాగులు చాలా బాగా కుదిరాయని, థియేటర్లో అభిమానులకు పండుగేనని అంటున్నారు. మరి బాలయ్య ఈజ్, పూరి స్టైల్ కలగలిసిన ఆ డైలాగ్స్ ఏ రేంజులో ఉంయాతో చూడాలంటే సెప్టెంబర్ 29 వరకు ఆగాల్సిందే. ఇకపోతే అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తుండగా ముస్కాన్ కీలక పాత్రలో నటిస్తోంది.

 
Like us on Facebook