ప్రభాస్-19 ఫస్ట్ లుక్, టైటిల్ పై క్లారిటీ వచ్చేసింది !

ప్రభాస్-19 ఫస్ట్ లుక్, టైటిల్ పై క్లారిటీ వచ్చేసింది !

Published on Apr 19, 2017 2:44 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు సుజీత్ తో కలిసి కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు టీజర్ కు సంబందించిన షూటింగ్ మాత్రమే జరుపుకున్న ఈ చిత్రం ‘బాహుబలి – ది కంక్లూజన్’ తర్వాత పూర్తి స్థాయి రెగ్యులర్ షూటింగుకు వెళ్ళనుంది. ఇప్పుడిప్పుడే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, టైటిల్ ఈ ఏప్రిల్ నెల 23వ తేదీన రిలీజవుతాయని తెలుస్తోంది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది.

అంతేగాక చిత్ర ట్రీజర్ ను ఫిబ్రవరి 28వ తేదీ నుండి ‘బాహుబలి – ది కంక్లూజన్’ ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. మొత్తం నాలుగు భాషల్లో ఈ టీజర్ ప్రదర్శితమవుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం మది కెమెరా వర్క్ చేస్తుండగా జాతీయ అవార్డు విజేత, ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, పాపులర్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహషాన్, లోయ్ లు పనిచేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు