ఈ లెక్కన “ప్రభాస్ 21” కాన్సెప్ట్ ఊహలకు మించే.!

ఈ లెక్కన “ప్రభాస్ 21” కాన్సెప్ట్ ఊహలకు మించే.!

Published on Sep 23, 2020 7:02 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టేకప్ చేసిన మూడు భారీ ప్రాజెక్టులలో ఒకదాన్ని తలదన్నే మరొకటి యూనివర్సల్ కాన్సెప్ట్ తో ముందుకొస్తున్నాయి. కంటెంట్ పరంగా “ఆదిపురుష్” తెలిసిందే కాబట్టి. దీనిని పక్కన పెడితే “రాధే శ్యామ్” మరియు తాను నటించనున్న 21వ చిత్రం సబ్జెక్టులు మాత్రం కాస్త యూనిక్ అని చెప్పాలి. రాధే శ్యామ్ కు అయినా ఏమన్నా హింట్ వచ్చింది కానీ నాగశ్విన్ తో చేయనున్న సినిమాను మాత్రం ఊహలకందని కాన్సెప్ట్ తోనే ప్లాన్ చేస్తున్నారని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటికే ప్రపంచ సినిమాలో ఎన్నో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సినిమాలు చూసాము. అయితే ఇపుడు నాగశ్విన్ అనుకున్న ప్రాజెక్ట్ కు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాలీవుడ్ లెవెల్ ఫిల్మ్ మేకర్ అయినటువంటి సింగీతం శ్రీనివాసరావు గారు పార్ట్ అవ్వడం ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన అంశం. ఆయన అప్పట్లోనే టైం ట్రావెల్ అంశాన్ని అత్యద్భుతంగా చూపించారు.

ఆదిత్య 369 తో పాటుగా మరెన్నో యూనిక్ సబ్జెక్టులను తీసిన ఆయన మళ్ళీ ఇన్నాళ్లకు ఇలాంటి ఒక చిత్రానికి క్రియేటివ్ హెడ్ గా పని చేయడం కాస్త ఆలోచించదగ్గ విషయమే. సో నాగశ్విన్ ఈ సినిమాకు స్కై ఫై టచ్ తో ఖచ్చితంగా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ నే టచ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి నాగశ్విన్ ఎలాంటి కాన్సెప్ట్ ను హోల్డ్ లో తుంహారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు