ఈ బిగ్ అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్.!

ఈ బిగ్ అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్.!

Published on Oct 23, 2020 8:09 AM IST

ఈరోజు అందరి అభిమాన హీరోగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనసున్న మనిషి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ప్రభాస్ అభిమానులు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో ఆ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల నుంచి చాలానే అప్డేట్స్ వచ్చాయి.

అడ్వాన్స్ విషెష్ చెబుతూ తన సినిమా “రాధే శ్యామ్” యూనిట్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు అలాగే ఈరోజు మధ్యాహ్నం మోషన్ పోస్టర్ టీజర్ ను కూడా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అయితే వీటితో పాటుగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కొన్ని బడా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వాటిలో ఒకటి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్న ప్రాజెక్ట్ కాగా మరొకటి ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్” నుంచి. నీల్ ప్రాజెక్ట్ పై ఎప్పటి నుంచో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఏమన్నా అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

అలాగే ఆదిపురుష్ టీం కూడా ఏమన్నా రివీల్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ప్రభాస్ మరియు నాగశ్విన్ ల ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ ఉండదని దర్శకుడు ముందే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు