కురుక్షేత్రంలో అర్జునుడిలా ‘బాహుబలి’లో ప్రభాస్..

కురుక్షేత్రంలో అర్జునుడిలా ‘బాహుబలి’లో ప్రభాస్..

Published on Oct 22, 2014 4:00 PM IST

Bahubali
తెలుగుతెరపై అత్యంత భారి బడ్జెట్ తో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక సినిమా ‘బాహుబలి’. ఆరడుగుల ఆజానబాహుడు ప్రభాస్ టైటిల్ పాత్రను పోషిస్తున్నాడు. యోధుడి పాత్ర కోసం ప్రభాస్ తన శరీరాన్ని బాగా పెంచాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటి నుండి సినిమాలో నటుల లుక్ ను సీక్రెట్ గా ఉంచారు. కేవలం బర్త్ డే టీజర్ లను మాత్రమే విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఇప్పటి నుండి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. అందులో భాగంగా ప్రభాస్ స్టిల్స్ ను విడుదల చేస్తున్నారు.

యుద్దభూమిలో ‘బాహుబలి’ గెటప్ లో ప్రభాస్ ను చూస్తుంటే కురుక్షేత్రంలో అర్జునుడిని గుర్తు చేస్తున్నాడు అంటూ అభిమానులు, ప్రేక్షకులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. రాజ్యం కోసం పోరాడుతున్న ఇద్దరి అన్నదమ్ముల కథ ఇదంటూ రాజమౌళి సినిమా గురించి చెప్పారు. ప్రభాస్ స్టిల్స్ చూసినవారు మహాభారత గాధను వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించడానికి రాజమౌళి సిద్దమయ్యాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు