ప్రభాస్ పాపులారిటీకి ఇదొక నిదర్శనం

ప్రభాస్ పాపులారిటీకి ఇదొక నిదర్శనం

Published on Dec 5, 2019 9:38 PM IST

‘బాహుబలి’ విజయం తర్వాత ప్రభాస్ ఛార్మ్ తెలుగును దాటి హిందీ, ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. ‘బాహుబలి’ సినిమా చూశాక పలు దేశాల్లో ప్రభాస్‌కు అభిమానులు తయారయ్యారు. ఇటీవల విడుదలైన ఆయన కొత్త చిత్రం ‘సాహో’ కూడా ఆయన కూడా ఆయన పాపులారిటీని పెంచిందనే అనాలి. అందుకు నిదర్శనమే బ్రిటిష్‌ ఈస్టర్న్‌ సంస్థ ప్రకటించిన ఏషియన్‌ సెక్సియెస్ట్‌ మేల్స్‌ 2019 జాబితా.

ఆన్‌లైన్‌ పోలింగ్ ద్వారా తయారుచేసిన ఈ జాబితాను బుధవారం లండన్‌లో విడుదల చేశారు. ఇందులో మొదటి పది స్థానల్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మొదటి స్థానంలో నిలవగా ప్రభాస్ పదవ స్థానంలో నిలిచాడు. దక్షిణాది నుండి టాప్ 10 స్థానాల్లో నిలిచిన సెలబ్రిటీ ప్రభాస్ ఒక్కడే కావడం విశేషం. ఈ సంగతి తెలిసిన డార్లింగ్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో రూపొందుతున్న ఒక భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు