వార్ కోసం భారీగా కండలు పెంచుతున్న ప్రభాస్

వార్ కోసం భారీగా కండలు పెంచుతున్న ప్రభాస్

Published on Feb 10, 2016 9:35 PM IST

Prabhas
ఫస్ట్ ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ఆయిన ‘బాహుబలి’ గత ఏడాది రిలీజై ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యంత భారీ బడ్జెట్ తో, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అద్భుత సృష్టిగా వచ్చిన ఈ బాహుబలి బాక్స్ ఆఫీసు వద్ద కూడా సరికొత్త రికార్డ్స్ ని సృష్టించి, ఆల్ టైం సౌత్ ఇండియన్ నెంబర్ 1 ఫిల్మ్ గా మారింది. ప్రస్తుతం ఈ చిత్ర టీం బాహుబలి 2 షూటింగ్ లో బిజీ బిజీగా ఉంది. గత కొద్ది రోజులుగా కేరళలోని లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమా కోసం మొదట్లో ప్రభాస్ కత్తి యుద్దాలు గుర్రపు స్వారీలతో పాటు భారీ దేహాన్ని పెంచాడు. మొదటి పార్ట్ రిలీజ్ తర్వాత కాస్త బాడీ తగ్గించిన ప్రభాస్ షూటింగ్ టైంకి మళ్ళీ బాడీని పెచాడు. రీసెంట్ గా సినిమాలోని ఓ వార్ సీక్వెన్ కోసం ఇంకా కండలు తిరిగిన దేహాన్ని పెంచమన్నాడట. దాంతో ప్రభాస్ ప్రస్తుతం ఇంకా స్పెషల్ డైట్ తీసుకుంటూ డిఫరెంట్ జిమ్ టెక్నిక్స్ ఫాలో అవుతూ తన బాడీని ఇంకా పెంచుతున్నాడు. ‘బాహుబలి – ది బిగెనింగ్’ కంటే పదింతలు బెటర్ గా ‘బాహుబలి – ది కంక్లూజన్’ ఉండాలని ఈ చిత్ర టీం అంతా ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాకి పనిచేస్తున్నారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు