దక్షిణాదిలో ఏ హీరోకి లేని ఫాలోయింగ్ ప్రభాస్ కు.!

దక్షిణాదిలో ఏ హీరోకి లేని ఫాలోయింగ్ ప్రభాస్ కు.!

Published on Nov 28, 2020 2:00 PM IST

ఇప్పుడు మన దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు మన తెలుగు హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ఖండాంతరాల్లో వచ్చిన ఫేమ్ ను అలా కాపాడుకుంటూ దాన్ని మరింత స్థాయిలో విస్తరిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంతరించుకున్నాడు.

అయితే ప్రభాస్ కు ఆఫ్ స్క్రీన్ లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన భారీ ఫాలోయింగే ఉంది. ఆ మధ్య అయితే పేస్ బుక్ లో యిట్టె 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసేవారు. అలా ఇప్పుడు డార్లింగ్ కౌంట్ ఏకంగా 21 మిలియన్ కు చేరుకుంది.

దీనితో మన దక్షిణాదిలోనే ఏ స్టార్ హీరోకు కూడా లేని విధమైన భారీ ఫాలోయింగ్ ను రాబట్టుకున్న ఏకైక హీరోగా నిలిచాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మొత్తం మూడు భారీ పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో “రాధే శ్యామ్” ఆల్ మోస్ట్ కంప్లీట్ కాగా ఆదిపురుష్ వచ్చే జనవరి నుంచి మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు