త్రిభాషా చిత్రంలో ప్రభాస్..?

త్రిభాషా చిత్రంలో ప్రభాస్..?

Published on May 27, 2016 8:30 AM IST

Prabhas
తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా బాహుబలి. ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి, శివుడిగా రెండు పాత్రలతో మెప్పించిన ప్రభాస్ ఇపుడు తన తరువాత సినిమా ‘రన్ రాజా రన్’ ఫేం సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన సమాచారం తెలిసింది.
​​
ఈ సినిమా ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ‘బాహుబలి’ సినిమా ద్వారా ఇండియా అంతటా ప్రభాస్ పాపులర్ అవడంతో మూడు భాషల్లో సినిమా చేస్తే బాగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో యు వి క్రియేషన్స్ వారు ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయంపైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి: ది కంక్లూషన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు