షారుక్, సల్మాన్, రజనీలను మించిపోయిన ప్రభాస్ !

షారుక్, సల్మాన్, రజనీలను మించిపోయిన ప్రభాస్ !

Published on Dec 8, 2016 7:42 PM IST

baahubali-2
రాజమౌళి, ప్రభాస్ ల కాంబోలో తెరకెక్కిన ‘బాహుబలి’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.600 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం అందులో హీరోగా నటించిన ప్రభాస్ కు సైతం విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎంతలా అంటే టుస్సాడ్స్ మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టేంతగా. ఇకపోతే ఈ బాహుబలి మొదటి పార్ట్ ఎండింగ్ లో రాజమౌళి వదిలిన ‘అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ఆసక్తికరమైన, శక్తివంతమైన ట్విస్ట్ బాహుబలి రెండవ పార్ట్ మీద విపరీతమైన అంచనాలను పెంచేసింది.

కేవలం ఒక సినిమా క్లైమాక్స్ దానికి అనుసంధానంగా వచ్చే మరొక భాగం మీద ఇంత భారీ ఎత్తున క్రేజ్ క్రియేట్ చేయడం అనేది ఇదే మొదటిసారి కావచ్చు. ఈ ప్రశ్న కేవలం తెలుగు వాళ్లనే కాక బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ మీద విపరీతమైన ఆసక్తి పెంచుకునేలా చేసింది. ఇటీవల ఒర్మాస్ మీడియా నవంబర్ నెల నుండి ఇప్పటిదాకా హిందీ ప్రేక్షకులకు కొన్ని సినిమాల లిస్ట్ ఇచ్చి వీటిలో 2017లో ఏ సినిమాని చూడాలని ఆసక్తిగా ఉన్నారు అనే సర్వే నిర్వహించగా ఆశ్చర్యకరంగా 51% మంది ప్రేక్షుకులు బాహుబలి -2 కే ఓట్ చేశారు. ఇక లిస్టులో ఉన్న షారుక్ ‘రాయీస్’ సినిమాకి 21%, సల్మాన్ ‘ట్యూబ్ లైట్’ కి 6%, రజనీ ‘రోబో-2’కు 2% మాత్రమే ఓట్లు దక్కాయి. మొత్తం మీద బాహుబలి పుణ్యమా అని ప్రభాస్ ఇండియాలోనే సూపర్ స్టార్లందరినీ మించిపోయాడన్నమాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు