ప్రభాస్ రాధే శ్యామ్ ట్విట్టర్ రికార్డు అదుర్స్..!

ప్రభాస్ రాధే శ్యామ్ ట్విట్టర్ రికార్డు అదుర్స్..!

Published on Jul 11, 2020 12:20 PM IST

సోషల్ మీడియాలో ప్రభాస్ రాధే శ్యామ్ టైటిల్ రికార్డు నమోదుచేసింది. రాధే శ్యామ్ టైటిల్ ఏకంగా 6.3 మిలియన్ ట్వీట్స్ తో దుమ్మురేపింది. ఎన్నాళ్లగానో ఊరిస్తున్న అప్డేట్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ మరియు రీట్వీట్స్ తో దుమ్మురేపాడు. దీనితో రాధే శ్యామ్ టైటిల్ 6.3 మిలియన్ ట్వీట్స్ దక్కించుకుంది. రోజంతా రాధే శ్యామ్ టైటిల్ ట్రెండింగ్ లో కొనసాగింది.

ఇక రాధే శ్యామ్ మూవీ ఫస్ట్ లుక్ సైతం విశేష స్పందన దక్కించుకుంది. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ సెన్సిబుల్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ పతాకంలో భారీ పాన్ ఇండియా చిత్రంగా రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. ఈ పీరియాడిక్ లవ్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2021లో రాధే శ్యామ్ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు