“సలార్” బిగ్గెస్ట్ అప్డేట్..వేసవికి మాస్ మేనియా లాక్ చేసిన ప్రభాస్..!

“సలార్” బిగ్గెస్ట్ అప్డేట్..వేసవికి మాస్ మేనియా లాక్ చేసిన ప్రభాస్..!

Published on Feb 28, 2021 3:37 PM IST

ప్రస్తుతం ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని రెబల్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ ఒక మెగా మాస్ అప్డేట్ తో వచ్చారు.

ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ హోంబలే పిక్చర్స్ వారు ప్రభాస్ మాస్ పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు..సో ఇక అప్పటికి మళ్లీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ప్రభాస్ మాస్ మేనియా రుచి చూడడం గ్యారంటీ అని చెప్పాలి.. మరి ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కేజీయఫ్ మేకర్లే చాలా మంది వర్క్ చేస్తున్నారు..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు