‘బాహుబలి’ తో మరే సినిమాను పోల్చొద్దంటున్న ప్రభాస్ !

‘బాహుబలి’ తో మరే సినిమాను పోల్చొద్దంటున్న ప్రభాస్ !

Published on Sep 24, 2017 4:52 PM IST


ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమ అందుకున్న అద్భుతమైన ఓజయాల్లో ‘బాహుబలి-2’ ఒకటి. తెలుగు సినిమా గతిని మార్చేసి ఖ్యాతిని అమాంతం పెంచేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్ల రూపాయలు వసూలుచేసింది. ఈ చిత్ర హిందీ వెర్షన్ టెలివిజన్ ప్రీమియర్ ను అక్టోబర్ 8 న ప్రదర్శించనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాజమౌళితో పాటు ప్రభాస్, రానాలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా బాహుబలిలా ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుందా అనే ప్రశాంకు సమాధానంగా బాహుబలితో మరే సినిమానీ పోల్చవద్దు. ఏ దర్శకుడు కూడా బాహుబలిని అనుకరించాలని చూడరు అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ‘సాహో’ చిత్రం పూర్తవగానే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ను ప్రారంభించనున్నాడు ప్రభాస్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు