జూలై 7 నుండి కొత్త సినిమా షూటింగ్లో పాల్గొననున్న ప్రభాస్ !

జూలై 7 నుండి కొత్త సినిమా షూటింగ్లో పాల్గొననున్న ప్రభాస్ !

Published on Apr 26, 2018 9:53 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ చిత్రీకరణ కోసం దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. సుమారు నెల రోజులపాటు ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘జిల్’ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ను చేయనున్నాడు. జూలై నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

ప్రభాస్ ‘సాహో’ షెడ్యూల్ ముగించుకుని జూలై 7నుండి షూటింగ్లో పాల్గొననున్నారు. పూజా హెగ్డే కథానాయకిగా నటించనున్న ఈ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడ రూపొందనున్న ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు