ఇంటర్వ్యూ : ప్రదీప్ మాచిరాజు – ఆ టైం లో చాలా డిజప్పాయింట్ అయ్యా

ఇంటర్వ్యూ : ప్రదీప్ మాచిరాజు – ఆ టైం లో చాలా డిజప్పాయింట్ అయ్యా

Published on Jan 28, 2021 4:01 PM IST


స్మాల్ స్క్రీన్ పై ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైన యంగ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు తన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి వెండితెరపై తన అదృష్టం పరీక్షించడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ సందర్భంగా అతని దగ్గర నుంచి ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఇందులో ప్రదీప్ ఎలాంటి విషయాలను పంచుకున్నారో చూద్దాం.

అసలు ఈ కథ, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది.?

మున్నా గారు ఈ కథను నాకు చెప్పినపుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నేను ఎలా అయితే ఎదురు చూస్తున్నానో టెలివిజన్ ప్రదీప్ కు 70 ఎంఎం స్క్రీన్ పై ప్రదీప్ కు ఎలాంటి డిఫరెన్స్ ఉండాలో యాంకర్ ప్రదీప్ ఛాయలు ఎక్కడా లేకుండా ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా మున్నా గారు రాసుకున్న రెండు క్యారెక్టర్స్ చాలా బాగా అనిపించాయి. అలాగే వేరియేషన్స్, గెటప్స్ ఉన్నాయి. చందమామ కథలు లాంటి ఫాంటసీ తో ఇంటర్వెల్ నుంచి ఇంకో ఎమోషన్ లో ఉంటుంది. సో ఇంతకంటే ఇంకేం కావాలి అనుకున్నా.

మీరు ముందు యాక్టర్ అవ్వాలి అనుకున్నారా?యాంకర్ అవ్వాలి అనుకున్నారా?

సగటు మిడిల్ క్లాస్ అబ్బాయిల్లానే యాక్టర్ అవ్వాలని కోరిక నాకు కూడా పుట్టింది. సినిమాలు బాగా చూసేవాడిని ఏదన్నా అవార్డ్ ఫంక్షన్ అయితే అందులో వాళ్ళు చెప్పే మాటల్ని బాత్రూం లో ప్రాక్టీస్ చెయ్యడం ఇంట్లో ఏదొకలా డబ్బులు అడిగి ఎక్కువగా సినిమాలు చూసి యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందా అని నేర్చుకున్నా కానీ అలా ఎదిగాక నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఓ రేడియో ఛానెల్లో పని చెయ్యడం అక్కడ నుంచి సినిమా ఆఫర్స్ వచ్చాయి.

అబ్బాయ్ గారు రోల్ కి స్పెషల్ వర్క్ ఏమన్నా చేసారా?

దానికి స్పెషల్ వర్క్ అని ఏమి లేదు, రాజమండ్రి ఊర్లో పోలవరం వెనకాల షూట్ చేసాం, అమ్మ నాన్న పుట్టింది అక్కడే అమలాపురం కాబట్టి ఇంట్లో ఆ భాష వచ్చేస్తుంది సో అక్కడ చాలా ఈజీ అయ్యింది. అంతే కానీ పెద్దగా స్పెషల్ వర్క్ ఏమీ అవసరం పడలేదు.

ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదని డైరెక్టర్ అంటున్నారు, అస్సలు కాన్సెప్ట్ ఏంటి?

రెగ్యులర్ లవ్ స్టోరీ అంటే..లవ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కానీ దాని ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అలాగే ఈ కథలో వచ్చే ట్విస్టులు ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి. అలాగే కొర్ పాయింట్ కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి అంతా మారుతుంది.

సినిమా లేట్ అవ్వడంపై ఆ టైం ఎలా తీసుకున్నారు?

ఆ టైం లో నేను చాలా డౌన్ అయ్యిపోయాను, థియేటర్స్ దొరికాయి సినిమా మార్కెట్ లోకి బాగా వెళ్ళింది ఇంకా సినిమా రిలీజ్ కావడానికి మూడు రోజులు ఉన్నాయి అనగా లాక్ డౌన్ పెట్టడంతో చాలా డిజప్పాయింట్ అయ్యాను. తర్వాత ఓటిటి రిలీజ్ అంటే మరో టెన్షన్ మొదలయ్యింది. అక్కడ మేము మళ్ళీ స్టక్ అయ్యాం కానీ మా ప్రొడ్యూసర్ సిల్వర్ స్క్రీన్ పైనే నా మొదటి సినిమా రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు అలా ఇప్పుడు మేము ఇక్కడున్నాం.

సినిమా మ్యూజిక్ కోసం చెప్పండి..

అదే మా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది, అనూప్ రూబెన్స్ గారు తన జాబ్ తో ట్రెమండ్యస్ జాబ్ అందించారు. ఆడియెన్స్ కు మా సినిమా రీచ్ అయ్యిన విధానం చాలా సంపాదించుకుంది. అలాగే అదే సినిమాకు ఒక లైఫ్ ఇచ్చింది.

చివరగా సినిమా సక్సెస్ పై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు?

ఎలా ఉన్నా సరే మా సినిమాను ప్రేమిస్తాం, కానీ నిన్న చాలా మందికి అలాగే ఇండస్ట్రీలో కొంతమంది బయట వారికి చూపించాం వారిలో డిఫరెంట్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా మా సినిమా నచ్చింది. అలాగే గీతా ఆర్ట్స్ అండ్ వారి గీతా ఆర్ట్స్ 2 వాళ్ళు కూడా చూసి గ్రాండ్ గానే రిలీజ్ చేస్తున్నారు.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు