నిజం తెలీకుండా హడావుడి చెయ్యొద్దంటున్న ప్రకాష్ రాజ్ !


ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం టాలీవుడ్లో నడుస్తున్న డ్రగ్స్ వివాదంపై స్పందించారు. నిన్న విచారణకు హాజరైన పూరి జగన్నాథ్ సాయంత్రం సోషల్ మీడియా ద్వారా తన మనసులో మాటల్ని బయటపెట్టారు. సిట్ ఎంక్వైరీకి హాజరయ్యానని, వాళ్ళడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పానని, కెల్విన్ ముఠాతో తనకెలాంటి సంబంధంలేదని అన్న ఆయన మీడియా మాత్రం అసలు నిజం తెలుసుకోకుండా రకరకాల ప్రోగ్రామ్లు చేసి తనను చాలా డిస్టర్బ్ చేశారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు.

దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ పూరి మాటల్ని సపోర్ట్ చేస్తూ ఒక విషయంలో పూర్తి నిజం బయటకురాకముందే ప్రజలుగాని, మీడియాగాని ఆ అంశాన్ని హడావుడి చేసి సంచలనం చేయడం కరెక్ట్ కాదని, ఇది అందరూ తెలుసుకోవాలని హితవు పలికారు. అలాగే పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇదే విషయాన్ని గుర్తుచేశారు. ఇకపోతే సిట్ విచారణలో భాగంగా ఈరోజు కెమెరామెన్ శ్యామ్ కె. నాయుడిని అధికారులు విచారిస్తున్నారు.

 

Like us on Facebook