సీనియర్ హీరోని డైరెక్ట్ చేయనున్న ‘అ !’ చిత్ర దర్శకుడు ?

సీనియర్ హీరోని డైరెక్ట్ చేయనున్న ‘అ !’ చిత్ర దర్శకుడు ?

Published on Apr 26, 2018 4:02 PM IST

ఇటీవల విడుదలైన ‘అ !’ చిత్రంతో దర్శకుడిగా తనలోని సృజనాత్మకతని, భిన్నత్వాన్ని, ప్రయోగాల పట్ల అభిరుచిని తెలిజెప్పిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకున్న ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ ఎలాంటి సినిమా చేస్తాడు, ఏ హీరోతో చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

ఇదిలా ఉండగానే తాజాగా ఆయన సీనియర్ హీరో, ఇటీవలే ‘గరుడవేగ’ తో మంచి విజయాన్ని అందుకున్న రాజశేఖర్ ఒక కథ వినిపంచారని, కథ నచ్చిన రాజశేఖర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలొచ్చాయి. అంతేగాక సినిమాకు ‘కల్కి’ అనే భిన్నమైన టైటిల్ ను సైతం నిర్ణయించినట్టు, జూలై నుండి ప్రాజెక్ట్ మొదలుకానున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు రాజశేఖర్ త్వరలో పలు ఆసక్తికరమైన సినిమాలతో మీ ముందుకు వస్తాను అనడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మరి వీరిద్దరి కలయిక నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు