‘ప్రతినిధి’ హైలైట్స్ ఏంటో చెప్పిన నారా రోహిత్

‘ప్రతినిధి’ హైలైట్స్ ఏంటో చెప్పిన నారా రోహిత్

Published on Apr 24, 2014 8:35 AM IST

Prathnidi
నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక కామన్ మాన్ సొసైటీలో జరుగుతున్న అన్యాయాల మీద తిరగబడి సిస్టంని నిలదీస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ప్రశాంత్ మండవ దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

ప్రతినిధి సినిమాకి ప్రధాన హైలైట్స్ ఏంటి అనే ప్రశ్నని నారా రోహిత్ ముందు ఉంచితే ”ప్రతినిధి’కి మెయిన్ హైలైట్ స్క్రిప్ట్ మరియు డైలాగ్స్. అలాగే మేము తీసిన సినిమాని సాయి కార్తీక్ తన మ్యూజిక్ తో మరో స్టెప్ పైకి తీసుకెళ్ళాడు. ఈ మూడు హైలైట్ అవుతాయని’ నారా రోహిత్ అన్నాడు. శుభ్ర అయ్యప్ప హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యంగ్ హీరో వేణు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కథ – డైలాగ్స్ ఆనంద్ రవి అందించిన ఈ సినిమాని సాంబశివరావు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు