చరణ్ సలహా వలనే ‘ధృవ’ రిలీజ్ చేశాను – అల్లు అరవింద్

allu-arvind
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ధృవ’ ఈ డిసెంబర్ 9న విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం గురించి నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ పలు చరణ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చాలా మంది హీరోల్లాగా వచ్చామా, షూట్ చేశామా అన్నట్టు కాకుండా చరణ్ సినిమాకు సంబందించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పట్టించుకుంటాడు. అందుకే అతనితో సినిమా చేస్తే దర్శక నిర్మాతలకు చాలా ధైర్యంగా ఉంటుంది. చరణ్ కెరీర్లో బెస్ట్ గా నిలిచిన ‘మగధీర’ సినిమా తరువాత రెండో బెస్ట్ మూవీ కూడా నాదే ఉండాలనే స్వార్థంతోనే ధృవ చేశాను’.

అనుకున్నట్టే సినిమా విజయవంతంగా నడుస్తోంది. కరెన్సీ బ్యాన్ ప్రభావం కొంతవరకూ ఉంది లేకుంటే కలెక్షన్లు ఇంకా బాగుండేవి. మొదట సినిమాని డిసెంబర్ రెండున రిలీజ్ చేద్దామని అనుకున్నాం కానీ నెల మొదట్లో అయితే ప్రజల వద్ద సరిపడా డబ్బు ఉండదు కనుక కాస్త వెనక్కి వెళదామని చరణ్ సలహా చెప్పాడు. అది విన్నాక కరక్టే కదా అనిపించి 9న రిలీజ్ చేశాం. అనుకున్న ప్రకారమే కలెక్షన్లు బాగా వచ్చాయి. చరణ్ లేకుంటే రిజల్ట్ ఇంతా బాగా వచ్చి ఉండేది కాదు’ అన్నారు. వరుసగా రెండు ఫెయిల్యూర్స్ తరువాత చరణ్ మంచి హిట్ సాధించడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.

 

Like us on Facebook