తమన్నాకి షాకిచ్చిన ప్రొడ్యూసర్

తమన్నాకి షాకిచ్చిన ప్రొడ్యూసర్

Published on Apr 25, 2018 12:07 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నదని మనకు తెలుసు. ఆమె నటించిన హిందీ చిత్రాలలో ఒకటి ఖమోషి, ఈ చిత్రం ప్రస్తుతం తమిళ్ లో రీమేక్ చేయబడుతున్న విషయం తెలిసిందే. తమిళ్ వెర్షన్ షూటింగ్ పూర్తిఅయినప్పటికీ, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న వషుహ్ భగ్నానీ హిందీ వెర్షన్ విషయంలో సంతృప్తి చెందని కారణంగా షూటింగ్ మధ్యలో ఆపివేయడం జరిగింది.

అయితే ప్రస్తుతం ఈ చిత్ర హిందీ వెర్షన్ ని రీషూట్ చేయవలసిందిగా దర్శకుడు చక్రి తోలేటిని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో తమన్నా ఒక మూగ అమ్మాయి పాత్ర పోషిస్తుంది. సినిమా రీషూట్ చేయమన్న ప్రొడ్యూసర్ ఆదేశంతో కొంత ఆశ్చర్యపడిన తమన్నా, తన డేట్స్ అడ్జెస్ట్ చేయడంలో ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది….

సంబంధిత సమాచారం

తాజా వార్తలు