ఇంటర్వ్యూ : నిర్మాత సురేష్ బాబు – ‘వెంకీమామ‌’ సాలిడ్ స్టోరీతో పాటు ఆల్ ఎమోషన్స్ ఉన్న సినిమా !

ఇంటర్వ్యూ : నిర్మాత సురేష్ బాబు – ‘వెంకీమామ‌’ సాలిడ్ స్టోరీతో పాటు ఆల్ ఎమోషన్స్ ఉన్న సినిమా !

Published on Dec 9, 2019 7:06 PM IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై సురేష్ బాబు, విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సంధర్భంగా నిర్మాతలు సురేష్ బాబు, విశ్వ ప్రసాద్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం…

 

వెంకటేష్, చైతు కలిసి చేస్తున్నారు.. ‘వెంకీ మామ’ కథ పై మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?

 

రైటర్ జనార్దన మహర్షి ముందుగా ‘వెంకీ మామ’ కథను నాకు వినిపించారు. లైన్ పరంగా చాల బాగుంది కాని, ట్రీట్మెంట్ పరంగా ఇంకా చాల చెయ్యాలనిపించింది. ఆ తరువాత ఆ లైన్ ను కోన వెంకట్ కి చెప్పి.. నువ్వు ఏమైనా చేయగలవా అంటే.. అతను కథ విని చాల బాగుంది చేద్దాం అని వర్క్ చేయడం జరిగింది. అలా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది.

 

మరి ఈ కథలోకి దర్శకుడు బాబీ ఎలా ఎంటర్ అయ్యారు?

 

బాబీతో నాకు అంతకుముందు పరిచయం లేదు. కోన వెంకటే తన గురించి చెప్పాడు. కోన చేసిన ట్రీట్మెంట్ ను చూసి బాబీ తన శైలిలో స్క్రిప్ట్ వర్క్ చేశాడు. ఫైనల్ గా ఓ రోజు వచ్చి ఈ కథకు సంబంధించి ఒక ఎపిసోడ్ చెప్పాడు. అది వినగానే కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చేశాయి. దాంతో ఇక ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం.

 

‘వెంకీ మామ’ ఫస్ట్ కాపీ చూశారు. సినిమా చూశాక మీరు ఎలా ఫీల్ అయ్యారు ?

 

ఫుల్ హ్యాపీ. ‘వెంకీ మామ’ సాలిడ్ స్టోరీ. చాల రోజుల తరువాత మంచి తెలుగు సినిమా చూశామనే గుడ్ ఫీలింగ్ ఉంటుంది. సినిమాలో గుడ్ ఎంటర్ టైన్మెంట్, గుడ్ యాక్షన్, గుడ్ ఎమోషన్స్, గుడ్ ఫీలింగ్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ సినిమాలో చాల బలంగా ఉంటాయి. లేడీస్ తో పాటు ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది.

 

‘వెంకీ మామ’ రిలీజ్ విషయంలో మొదటి నుండి చాల విడుదల తేదీలు వినిపించాయి ?

 

ఫస్ట్ టైం నేను ఈ సినిమా రిలీజ్ విషయంలోనే కన్ ఫ్యూజ్ అయ్యాను. మేము ఫస్ట్ అక్టోబర్ సెకెండ్ వీక్ లో రిలీజ్ చేయాలని ముందు నుంచీ ప్లాన్ చేసుకున్నాం. కానీ వెంకటేష్ కి కాలు బెణికింది, దాంతో ఆ డేట్ మారింది. ఆ తరువాత రాశి డేట్స్ లేట్ అయి.. అల పోస్ట్ ఫోన్ అయింది. అయితే సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చూస్తే అప్పటికే బన్నీ, మహేష్ సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు మేనేజర్స్ అందర్నీ పిలిచి ఎప్పుడూ సినిమా రిలీజ్ చేద్దామని మీటింగ్ పెడితే డిసెంబర్ 13న అయితే బెస్ట్ అని అందరం ఫిక్స్ అయ్యాం.

 

థియేటర్స్ గురించి ఎప్పటి నుండో చాల రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి ?

 

సింగిల్ థియేటర్స్ కూడా మల్టీప్లెక్స్ లా మారిపోతే ఖచ్చితంగా సినిమాలతో పాటు ప్రేక్షుకులకు కూడా మంచి సౌలభ్యం ఉంటుంది. ఉదాహరణకు ఒక ఊరిలో రెండు థియేటర్స్ ఉన్నాయి. రోజుకు పది షోలు వేస్తున్నారనుకున్నాం. రెండు షోలు ఒక సినిమా, మరో నాలుగు షోలు మరో సినిమా ఇలా షోలును అన్ని సినిమాలు పంచుకుంటే.. ప్రతి సినిమా ప్రేక్షుకులు చేరువ అవుతుంది. ఆడియన్స్ కు కూడా వాళ్ళకి నచ్చిన సినిమాని, అలాగే అన్ని రకాల సినిమాలను చూసే అవకాశం ఉంటుంది.

 

అభిరామ్ ‘అసురన్’లో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజం ఎంత ?

 

అవి పూర్తి అవాస్తవం. ‘అసురన్’లో అభిరామ్ నటించట్లేదు. ప్రస్తుతం అభి యాక్టింగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు.

 

స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చెయ్యట్లేదు. చేస్తే ఇండస్ట్రీకి మంచింది కదా ?

 

చెయ్యాలి. వాళ్ళు చేసేలా నిర్మాతలు డైరెక్టర్ లు కూడా మంచి కంటెంట్ తో వెళ్ళాలి. ఈ విషయంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బంగారం అండి. సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేస్తాడు. పైగా అన్ని రకాల సినిమాలు చేస్తాడు. ఇవ్వాళ బాలీవుడ్ కి అతను చాల కీలకం, అలాగే ఇక్కడ కూడా మన హీరోలు చెయ్యాలి. రానున్న రోజుల్లో చేస్తారనే అనుకుంటున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు