కొత్త కొత్తగా అనిపిస్తున్న ‘నా నువ్వే’ ట్రైలర్ !
Published on May 16, 2018 3:05 pm IST

కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ‘నా నువ్వే’ త్వరలోనే విడుదలకానుంది. కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదలచేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ కళ్యాణ్ రామ్ గత సినిమాలకన్నా చాలా భిన్నంగా ఉంది. అంతేగాక కళ్యాణ్ రామ్ ట్రైలర్ మొత్తం చాలా క్లాస్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా అయితే తన స్క్రీన్ పెజెన్స్ తో ప్రతి ఫ్రేమ్ లో చాలా అందంగా కనిపిస్తూ అలరించింది.

హీరో హీరోయిన్ల మధ్యన కెమిస్ట్రీ కూడ బాగా కుదిరింది. ఇక సినిమాటోగ్రఫర్ పిసి. శ్రీరామ్ తన కెమెరా మాయాజాలంతో ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అందంగా, ఫ్రెష్ గా తీర్చిదిద్దగా శరత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించాడు. మొత్తం మీద కొత్త కొత్తగా అనిపిస్తున్న ఈ ట్రైలర్ ఓ మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ మన ముందుకురాబోతోందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమా బ్యానర్ పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :

 
Like us on Facebook