పవన్ – త్రివిక్రమ్ ల సినిమా షూటింగ్ అప్డేట్ !

పవన్ – త్రివిక్రమ్ ల సినిమా షూటింగ్ అప్డేట్ !

Published on Oct 26, 2017 11:55 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న చిత్రం కొత్త షెడ్యూల్ కు సిద్ధమైంది. ఈ షెడ్యూల్ యూరప్ లో జరగనుంది. అందుకే పవన్, త్రివిక్రమ్ లు నిన్న రాత్రి బల్గెరియా బయలుదేరి వెళ్లిన్నట్టు సమాచారం. 29 నుండి మొదలుక్నున్న ఈ షెడ్యూల్ సుమారు 15 రోజుల పాటు జరుగుతుందట.

ఈ షెడ్యూల్లో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు రెండు పాటల్ని కూడా షూట్ చేస్తారట. ఈ షెడ్యూల్లో ఇద్దరు హీరోయిన్లు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కూడా పాల్గొననున్నారు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాధ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కుష్బు, బోమన్ ఇరాని వంటి సీనియర్ నటులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు