పవన్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ అది కాదు !

పవన్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ అది కాదు !

Published on Aug 17, 2017 11:40 AM IST


పవన్ – త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న సినిమాపై అభిమానుల్లో ఏ స్థాయి క్రేజ్ ఉందో తెల్సిన సంగతే. ఈ క్రేజ్ వలనే చిత్రానికి సంబందించిన ప్రతి అంశం హాట్ టాపిక్ గా మారిపోతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ వచ్చిన ఒక వార్త తెగ హడావుడి చేస్తోంది. సోషల్ మీడియాలో ‘రాజు వచ్చినాడు’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారనే ప్రచారం జరుగుతోంది.

కానీ చిత్ర సన్నిహిత వర్గాలు మాత్రం అవన్నీ ఒట్టి పుకార్లేనని, దర్శకుడు త్రివిక్రమ్ కు టైటిల్ ను ఇప్పుడే బయటపెట్టే ఉద్దేశ్యంలో లేరని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేగాక ఇంతకుముందు బయటికొచ్చిన ‘ఇంజనీర్ బాబు, గోకుల కృష్ణుడు, దేవుడే దిగి వచ్చినా’ వంటివి కూడా నిజం కాదని తేల్చేశారట. కథ కథనాల్లో మాత్రమే కాకుండా టైటిల్ విషయంలో కూడా ప్రత్యేకత చూపే త్రివిక్రమ్ పవన్ కోసం ఎలాంటి టైటిల్ ను సిద్ధం చేశారో తెలియాలంటే కొద్దిసమయం పడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు