విజయ్ ‘పులి’కి సూపర్ ఓపెనింగ్స్!

విజయ్ ‘పులి’కి సూపర్ ఓపెనింగ్స్!

Published on Oct 6, 2015 3:58 PM IST

Puli
తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ‘పులి’ సినిమా అక్టోబర్ 1న విడుదలైన విషయం తెలిసిందే. ఇక కొన్ని ఆర్థిక ఇబ్బందులతో తమిళ నాట మొదటి రోజు ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా, తెలుగులో శుక్రవారం సాయంత్రానికి గానీ విడుదల కాలేదు. దీంతో ఈ సినిమా మొదటిరోజే భారీ ఓపెనింగ్స్‌ను కోల్పోయింది. అదేవిధంగా ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ సాదాసీదాగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైంది. కాగా ఈ అభిప్రాయాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సినిమా మొదటి వారాంతం సూపర్ కలెక్షన్స్ సాధించింది.

ఫస్ట్ వీకెండ్ పులి సినిమా ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఈ సినిమాకున్న క్రేజ్‌ను బయటపెట్టింది. బాహుబలి తర్వాత ఆ స్థాయి గ్రాఫిక్ వర్క్ ఉన్న సినిమా ఇదే కావడంతో పులిపై మొదట్నుంచే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల వల్లే సినిమా మొదటివారాంతం ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక విజయ్ స్టార్‌డమ్ కూడా ఈ స్థాయి కలెక్షన్స్‌కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మిక్స్‌డ్ రెస్పాన్స్‌తోనే మంచి కలెక్షన్స్ కొల్లగొడుతోన్న ఈ సినిమా లాంగ్ రన్‌లోనూ ఇదే స్థాయి కలెక్షన్స్ వసూలు చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుందా అన్నది ఆసక్తికర అంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు