కుమారుడి కోసం పూరి జగన్నాధ్ కాస్ట్లీ గిఫ్ట్.

కుమారుడి కోసం పూరి జగన్నాధ్ కాస్ట్లీ గిఫ్ట్.

Published on Sep 26, 2014 3:05 PM IST

Puri-jagannath-and-Akash
కుమారుడికి కోసం చాలా ఖరీదైన గిఫ్ట్ ను అమెరికా నుండి తెప్పించారు దర్శకుడు పూరి జగన్నాధ్. తండ్రి ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ తో పూరి కుమారుడు, చైల్డ్ ఆర్టిస్ట్ ఆకాష్ చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రఖ్యాత ఆపిల్ సంస్థ ఇటివలే విడుదల చేసిన ‘ఐ ఫోన్ 6 ప్లస్’ను ఆకాష్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ఫోన్ అమెరికాలో మాత్రమే లభిస్తుంది. ఇండియాలో ఇంకా విడుదల కాలేదు. కొడుకు కోసం ప్రత్యేకంగా తెప్పించారు పూరి. దీని ఖరీదు ఇండియాలో లక్ష రూపాయల పైమాటే.

‘మా నాన్న నాకు ఆపిల్ ఐ ఫోన్ 6 ప్లస్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఏపిలో నాదే ఫస్ట్ మొబైల్’ అంటూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నాడు ఆకాష్.

తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో నటించిన ఆకాష్ ను భవిష్యత్ లో హీరోని చేయాలనేది పూరి జగన్నాధ్ ఆలోచన. ప్రస్తుతం ఆకాష్ నటనతో పాటు పలు అంశాలలో శిక్షణ తీసుకుంటున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘గబ్బర్ సింగ్’, ‘ధోని’ సినిమాలలో మంచి పెర్ఫార్మన్స్ కనబరిచాడు ఆకాష్.

aakash-puri

సంబంధిత సమాచారం

తాజా వార్తలు