సెకండ్ ఛాన్స్ దక్కించుకున్న పూరి హీరోయిన్ !
Published on Jul 10, 2017 9:22 am IST


పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘ఇజం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అదితి ఆర్య తాజాగా కొత్త సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఒకప్పటి మిస్ ఇండియా అయిన ఈమె ‘నిన్ను వదిలి నేను పోలేనులే’ అనే సినిమాలో హీరోయిన్ గా సెట్ అయింది. మొత్తం ఐదుగురు కథానాయికలున్న ఈ సినిమాలో అదితి ఆర్యకు ప్రాధాన్యమున్న పాత్రే దక్కిందని తెలుస్తోంది.

అదితి ఆర్య కూడా కథ, పాత్ర గురించి వినగానే ఓకే చెప్పేశారట. హీరో హవీష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సాయి శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా రమేష్ వర్మ నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రం తనకు తప్పుకుండా మంచి బ్రేక్ ఇస్తుందని హవీష్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

 
Like us on Facebook