విచారణకు హాజరైన పూరి జగన్నాథ్ !


డ్రగ్స్ వ్యవహారంలో ఆబ్కారీ శాఖ నుండి నోటీసులు అందుకున్న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈరోజు విచారణకు హాజరయ్యారు. సిట్ బృందం ప్రత్యేకంగా తయారుచేసిన ప్రశ్నాపత్రం ఆధారంగా పూరిని ప్రశ్నించనుంది. డ్రగ్ డీలర్ కెల్విన్ కాల్ డేటా ఆధారంగా తయారుచేసిన జాబితాలో 12 మంది సినీ ప్రముఖులు ఉన్నారు.

రోజుకొకరి చొప్పున సిట్ బృందం 12 రోజులపాటు విచారణ జరపనుంది. ఈ విచారణ ద్వారా పరిశ్రమలో మత్తు మందులు వాడకం ఏ స్థాయిలో జరిగింది, ఇందులో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు వంటి కీలక వివరాలను పోలీసులు రాబట్టనున్నారు. పటిష్టమైన భద్రత మధ్య జరగనున్న ఈ విచారణ మొత్తాన్ని సిట్ బృందం రికార్డ్ చేయనుంది.

 

Like us on Facebook