పూరీ-నితిన్‌ల కాంబోలో మరో సినిమా!

పూరీ-నితిన్‌ల కాంబోలో మరో సినిమా!

Published on Mar 29, 2015 6:04 PM IST

puri_nithin
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో నితిన్ కాంబినేషన్‌లో కొత్త సినిమా రూపు దిద్దుకోనుంది. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ తన సోషల్ సైట్ ద్వారా తెలిపారు. వీరిద్దరి కలయికలో గతంలో ‘హార్ట్‌ అటాక్’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ సినిమా గత సంవత్సరం జనవరిలో విడుదలై విమర్శకుల ప్రశంసల పరంగానూ, బాక్సాఫీస్ పరంగానూ బాగుందనిపించుకుంది. ‘హార్ట్ అటాక్’ సినిమాతో పూరీ-నితిన్‌ల కాంబినేషన్‌పై మంచి ఆసక్తి ఏర్పడింది.

ఇప్పుడా కాంబినేషన్‌ను మళ్ళీ రిపీట్ చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూరీతో కలిసి మళ్ళీ సినిమా చేయడం పట్ల నితిన్ తన ఆనందాన్ని పంచుకున్నారు. “నాకు చాలా ఇష్టమైన దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మరో సినిమా చేయనున్నా. ఎగ్జైటింగ్‌గా ఉంది” అంటూ నితిన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్, నితిన్‌లు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు