పూరి నెక్స్ట్ సినిమా హీరో మహేష్ బాబు.!

పూరి నెక్స్ట్ సినిమా హీరో మహేష్ బాబు.!

Published on Sep 30, 2014 9:44 AM IST

puri-jagannat-maheshbabu
సినిమా సినిమాకి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేసే డైరెక్టర్స్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ముందుంటాడు. పూరి జగన్నాధ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాని 2015 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పూరి తన తదుపరి సినిమా కథ మరియు హీరోని కూడా ఫైనలైజ్ చేసాడు.

తాజాగా తన తదుపరి సినిమా పూరి జగన్నాధ్ ఎవరితో అని అడిగితే ‘నా తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందని, దానికి స్టొరీ లైన్ మరియు స్క్రిప్ట్ కూడా రెడీ అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు లోకల్లో లేరు తను ఇండియా తిరిగి రాగానే మహేష్ ని కలిసి కథ చెబుతానని’ సమాధానం ఇచ్చాడు. మహేష్ త్వరలోనే కొరటాల శివ సినిమాకి షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. మహేష్ బాబు పూరి కథని ఓకే చేస్తే కొరటాల శివ సినిమా చివరి దశకు చేరుకోగానే పూరి సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు