పూరీ-నితిన్‌ల సినిమాకు ఇంటరెస్టింగ్ టైటిల్!

పూరీ-నితిన్‌ల సినిమాకు ఇంటరెస్టింగ్ టైటిల్!

Published on Apr 1, 2015 10:44 AM IST

nithin-purijaganth

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో నితిన్ కాంబినేషన్‌లో కొత్త సినిమా రూపు దిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ తన సోషల్ సైట్ ద్వారా తెలిపారు. వీరిద్దరి కలయికలో గతంలో ‘హార్ట్‌ అటాక్’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ సినిమా గత సంవత్సరం జనవరిలో విడుదలై విమర్శకుల ప్రశంసల పరంగానూ, బాక్సాఫీస్ పరంగానూ బాగుందనిపించుకుంది. ‘హార్ట్ అటాక్’ సినిమాతో పూరీ-నితిన్‌ల కాంబినేషన్‌పై మంచి ఆసక్తి ఏర్పడింది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు ఓ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘మా అమ్మ సీతామాలక్ష్మి’ అన్న పేరును పరిశీలిస్తున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేదీ’ వంటి అచ్చతెలుగు పేర్లతో తెలుగు సినిమాలు రూపొందడం ఆహ్వనించదగ్గ విషయమే. పూరీ లాంటి మాస్ దర్శకుడు తన సినిమాకు ఇలాంటి సరికొత్త పేరును పరిశీలించడం ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పూరీ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ‘జ్యోతిలక్ష్మి’ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు