రవి తేజ సినిమాలు ఎందుకు చేయడం లేదో చెప్పిన పూరి !

రవి తేజ సినిమాలు ఎందుకు చేయడం లేదో చెప్పిన పూరి !

Published on Oct 19, 2016 7:53 PM IST

ravi-teja-and-puri1
సీనియర్ హీరో మాస్ మహారాజ్ రవి తేజ్ పోయిన ఏడాది ‘బెంగాల్ టైగర్’ తరువాత ఇప్పటి వరకూ మరో సినిమా చేయలేదు. కోన్ని రోజుల క్రితం తనకు ‘పవర్’ వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు బాబితో ఓ సినిమా చేస్తాడని, త్వరలో ఆ ప్రాజెక్ట్ తట్టాలెక్కనుందని అనుకున్నారు. కానీ అది కూడా ఆగిపోయిందని తెలియడంతో అందరూ ఏమైంది రవితేజ్ సినిమాలెందుకు చేయడంలేదు. ఆయనే కథలు నచ్చక వద్దనుకుంటున్నాడా లేకపోతే ఆఫర్లు రావడంలేదా అనే సందేహాలను వెలిబుచ్చారు.

ఈ సందేహాలన్నిటికీ సమాధానం రవితేజ్ చెప్పలేదు గాని ఆయన బెస్ట్ ఫ్రెండ్ దర్శకుడు పూరి చెప్పేశారు. తాజాగా జరిగిన ‘ఇజం’ సినిమా తాలూకు ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ రవితేజ ప్రస్తుతం ట్రావెలింగ్ లో ఉన్నాడని, కొత్త ప్రపంచాన్ని, కొత్త మనుషుల్ని చూడాలనుకునుంటున్నాడని, కుటుంబంతో వీలైనంత సమయం గడపాలనుకుంటున్నాడని తెలిపారు. అలాగే తను, రవి తేజ్ గత 15 ఏళ్లుగా గ్యాప్ లేకుండా కష్టపడ్డామని అందుకే ఈ రిలాక్సేషన్ అని, లైఫ్ లో విషయాల్ని ఈజీగా తీసుకోవాలని, కొత్త విషయాల్ని తెలుసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు