ఖచ్చితంగా ఇతను కొత్త బాలయ్యే !

ఖచ్చితంగా ఇతను కొత్త బాలయ్యే !

Published on Jul 28, 2017 4:10 PM IST


బాలకృష్ణ తన 101వ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అనగానే అదేంటి వీరిద్దరి స్టైల్స్ కి ఏమాత్రం పొంతన ఉండదు వర్కవుట్ అవుతుందా అని అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు అనుమానపడ్డారు. ఆ తర్వాత ‘పైసా వసూల్’ అనే టైటిల్ ను ప్రకటించగానే అసలు సినిమా తీరేమిటి అని ఇంకాస్త కన్ఫ్యూజన్ కు గురై కంగారు కూడా పడ్డారు. సినిమాపై చాలా మంది చాలా రకాల రూమర్లను స్ప్రెడ్ చేశారు. కానీ తాజగా విడుదలైన స్టంపర్ చూస్తే అన్ని అనుమానాలు పటాపంచలైపోయినట్టు అనిపిస్తోంది.

ఎందుకంటే ట్రైలర్ లో కనిపిస్తున్న బాలకృష్ణ క్యారెక్టరైజేషన్, కంటెంట్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కు కావాల్సిన విధంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ‘అన్నా రెండు బాల్కనీ టికెట్లు కావాలి, నేను సింహాన్నో కాదో మీరే చెప్పాలి, మందేసిన మదపుటేనుగుని రా’ వంటి డైలాగులకు తోడు బాలయ్య బాడీ లాంగ్వేజ్, ఆయనలో కనిపిస్తున్న పూరి హీరో మార్క్ అన్నీ కలిసి ఇందులో ఖచ్చితంగా కొత్త బాలయ్య కనిపిస్తారనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. సెప్టెంబర్ 29న విడుదలకానున్న ఈ చిత్రం ఎలా ఉన్నా బాలయ్య పాత్ర మాత్రం చాన్నాళ్ల పాటు గుర్తుండిపోవడం ఖాయం.

స్టంపర్ కొరకు క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు