విజయ్ దేవరకొండ కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకొస్తున్న పూరి

విజయ్ దేవరకొండ కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకొస్తున్న పూరి

Published on Dec 11, 2019 8:37 PM IST

ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ త్వరలో విజయ్ దేవరకొండతో సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందిచాలని పూరి భావిస్తున్నారు. అందుకే కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఇటీవలే ‘కబీర్ సింగ్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న కైరా హిందీలో నాలుగైదు సినిమాలకు సైన్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఈమే బిజీ హీరోయిన్. అందుకే ఆమెను తీసుకుంటే హిందీ మార్కెట్ ఉంటుందని పూరి, ఛార్మీలు భావించి ఉండవచ్చు. ఇక కైరా సైతం పూరి, దేవరకొండల సినిమాలో నటించడానికి ఆసక్తిగానే ఉందట. అయితే షెడ్యూల్ చాలా బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి ఆమె ట్రై చేస్తోందని, డేట్స్ కుదిరిన వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందని టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు