‘లోఫర్’ కి సాఫ్ట్ టైటిల్ ఫిక్స్ చేసిన పూరి

‘లోఫర్’ కి సాఫ్ట్ టైటిల్ ఫిక్స్ చేసిన పూరి

Published on Oct 5, 2015 1:27 PM IST

varun-tej-puri
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ సినిమా అంటే పక్కా మాస్ ఎంటర్ టైనర్ అని చెప్పచ్చు.. ఆయన కథలకి, హీరో పాత్రలకి దీటుగానే ఆయన సినిమా టైటిల్స్ కూడా ఉంటాయి. ఇప్పటికే పోకిరి, దేశముదురు, నేనింతే, చిరుత లాంటి డిఫరెంట్ టైటిల్స్ తో సిఎనేమాలు చేసిన పూరి తన తదుపరి సినిమాని మెగా హీరో వరుణ్ తేజ్ తో చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రారంభించినప్పుడే ఈ సినిమాకి లోఫర్ అనే టైటిల్ ని ఫిక్ చేసారు.

ఈ సినిమా పూర్తి మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా కావడం వలన ఆ టైటిల్ ని మార్చుదాం అని ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే పక్కా మాస్ టైటిల్ పెట్టిన పూరి జగన్నాద్ ఇప్పుడు అదే సినిమాకి ప్యూర్ సాఫ్ట్ టైటిల్ ని ఫిక్స్ చేసారు. అదే ‘మా అమ్మ మహాలక్ష్మి’. దీని ప్రకారం చాలా రోజుల తర్వాత పూరి మరోసారి పూర్తో సాఫ్ట్ టైటిల్ తో మన ముందుకు రానున్నాడు. మరి ఈ టైటిల్ ఎంత వరకూ ప్రేక్షకులకు రీచ్ అవుతుందనేది చూడాలి. వరుణ్ తేజ్ సరసన దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ త్వరలోనే ఈ టైటిల్ మరియు రిలీజ్ డేట్స్ గురించి తెలియజేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు