ఇక్కడ షూట్ కూడా పూర్తి చేసుకున్న “పుష్ప”.!

ఇక్కడ షూట్ కూడా పూర్తి చేసుకున్న “పుష్ప”.!

Published on Mar 6, 2021 10:00 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. వీరి కాంబో ఫస్ట్ టైం ఓ పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం బన్నీ క్రేజ్ వల్ల కూడా దీనికి మంచి హైప్ ఇప్పుడు ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి షూట్ ను మేకర్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

మరి లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం తాలూకా షూట్ తమిళ నాడులో ప్లాన్ చేసిన షెడ్యూల్ తాజాగా పూర్తయ్యినట్టు తెలుస్తుంది. అయితే ఈ షెడ్యూల్ లోనే బన్నీపై మాస్ సాంగ్ ను కూడా చేసేసినట్టు అనుకోవాలి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఆగష్టు 13న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు