ఆ నిర్మాణసంస్థ మూతపడలేదు..!

ఆ నిర్మాణసంస్థ మూతపడలేదు..!

Published on May 28, 2016 3:51 PM IST

PVP-Cinemas
పివిపి సినిమా… ప్రసాద్. వి. పొట్లూరి నిర్మాతగా కొనసగుతున్న సంస్థ. కార్పోరేట్ సంస్థ తరాహాలో భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తున్న సంస్థ. వీరిమధ్య కాలంలో నిర్మించిన చిన్న సినిమా ’క్షణం’ మినహా ప్రతి సినిమా అంతో ఇంతో నష్టాలను తీసుకొచ్చింది. ఇక మహేష్ బాబుతో కలిసి నిర్మించిన ’బ్రహ్మోత్సవం’ కూడా అంతగా విజయం సాధించకపోయేసరికి ఇక పివిపి వారు సినిమాలు నిర్మించరని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని పివిపి సంస్థ కొట్టిపారేసింది.

ప్రస్తుతం ఈ సంస్థ మూడు సినిమాలను నిర్మించబోతున్నట్టు సమాచారం. తెలుగు-హిందీ భాషల్లో ఒక ద్విభాషా చిత్రంతో పాటు, తెలుగు, తమిళంలో కూడా ఓ భారీ సినిమా సినిమా తీస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు తెలుగులో తక్కువ బడ్జెట్ లో ’క్షణం’ సినిమా లాగా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాబట్టి పివిపి సినిమా నిర్మాణం నుంచి వైదొలగలేదని సినిమా నిర్మాణం కొనసాగిస్తుందని అర్థమవుతుంది. ఈ సంస్థ నుంచి వచ్చే తరువాత సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు