పోలీస్ పాత్రలో కనిపించనున్న లక్ష్మీ రాయ్ !

పోలీస్ పాత్రలో కనిపించనున్న లక్ష్మీ రాయ్ !

Published on Dec 18, 2017 5:45 PM IST

గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూ ఇటీవలే బాలీవుడ్లో ‘జూలీ-2’ అనే సినిమా చేసి వార్తల్లో నిలిచిన హీరోయిన్ లక్ష్మీ రాయ్ బలమైనదైతే ఎలాంటి పాత్రైనా చేస్తానంటున్నారు. ప్రస్తుతం ఆమె అంజలితో కలిసి ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతోంది.

అందులో లక్ష్మీ రాయ్ పవర్ ఫుల్ పోలీస్ ఉమెన్ గా కనిపించనున్నారని టాక్. ఈ చిత్రాన్ని ‘గుంటూరు టాకీస్’ చిత్ర నిర్మాత రాజ్ కుమార్ నిర్మిస్తుండగా సోషియో ఫాంటసీ చిత్రం ‘రాయల హారం’ను డైరెక్ట్ చేసిన దర్శకుడు కర్రి బాలాజీ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ థ్రిల్లర్ ఎంటర్టైనర్ యొక్క రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు