మరో తమిళ సినిమాకి సైన్ చేసిన రాశి ఖన్నా

మరో తమిళ సినిమాకి సైన్ చేసిన రాశి ఖన్నా

Published on Sep 29, 2016 3:56 PM IST

raasi-kanna
‘సుప్రీం’ సినిమా విజయంతో ఈ సంవత్సరం సూపర్ సక్సెస్ అందుకున్న హీరోయిన్లలో రాశి ఖన్నా కూడా ఒకరిగా నిలిచింది. ప్రస్తుతం ఈమె రామ్ సరసన ‘హైపర్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం రేపు విడుదలకు సిద్దమవుతుండగానే ఆమె కోలీవుడ్ లో సైతం పలు ప్రాజెక్టులను దక్కించుకుంది. కొద్ది రోజుల క్రితమే సిద్దార్థ హీరోగా తెరకెక్కనున్న ‘సైతాన్ కా బచ్చా’ సినిమాని ఒప్పుకున్న రాశి ఖన్నా ఇప్పుడు మరో ప్రాజెక్టుకు సైన్ చేసింది.

తమిళంలో ‘డిమాంటి కాలనీ’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. హీరో అథర్వా ఇందులో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. దీంతో రాశి ఖన్నా కోలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ లెవల్లో జరగనుంది. ఇకపోతే రాశి ఖన్నా తెలుగులో గోపిచంద్ హీరోగా ‘ఆక్సిజన్’ చిత్రం చేస్తూనే రవి తేజ హీరోగా మరో సినిమాకు సైన్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు