మెగా హీరో సరసన హాట్ బ్యూటీ రాశీ ఖన్నా.?

మెగా హీరో సరసన హాట్ బ్యూటీ రాశీ ఖన్నా.?

Published on Jul 6, 2015 10:46 AM IST

Rashi-khanna-Saidarm-teja
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో క్యూట్ క్యూట్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హాట్ బ్యూటీ రాశీ ఖన్నా. రీసెంట్ గా వచ్చిన జిల్ సినిమాలో తన లుక్స్ తోనే కాకుండా అందాల ఆరబోసి హాట్ హాట్ గా కనిపించి, గ్లామర్ రోల్స్ తను చెయ్యగలదని నిరూపించింది. ప్రస్తుతం ఈ భామ రామ్ సరసన శివం’ సినిమాలో, అలాగే రవితేజ సరసన బెంగాల్ టైగర్’ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే రాశి ఖన్నాకి తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అయిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన నటించే అవకాశం కొట్టేయడం.

ఈ ఏడాది ‘పటాస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమాకి సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నాని సెలక్ట్ చేసారని సమాచారం. అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతో రాశి ఖన్నా వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా ఆగష్టు చివర్లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంటే, రాశి ఖన్నా బెంగాల్ టైగర్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు