‘గరం’ సెకండాఫ్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది – ఆది

‘గరం’ సెకండాఫ్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది – ఆది

Published on Feb 10, 2016 7:32 PM IST

garam
‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో ఆది తన గత సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలేకపోయాడు. అందుకే ఈ సారి కాస్త గ్యాప్ తీసుకొని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ‘గరం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. దాంతో ఈ చిత్ర టీం జోరుగా ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.

మెయిన్ గా ఈ సినిమాని ఆది ఫాదర్ అ సాయి కుమార్ స్వయంగా నిర్మించడంతో రిలీజ్ అండ్ ప్రమోషన్స్ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఆది సినిమా ఎలా ఉంటుందనేది చెబుతూ ‘గరంలో నేను ఓ స్మాల్ టౌన్ కి చెందిన చదువు సంధ్యా లేకుండా మాస్ గా పెరిగిన కుర్రాడిగా కనిపిస్తాను. ఇందులో మాస్ అంశాలు ఉన్నప్పటికీ అందరికీ నచ్చే ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే సెకండాఫ్ లో మేము చూపించే ట్విస్ట్స్ థియేటర్స్ లోని ప్రేక్షకులను కచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. అదే ఈ సినిమాకి పెద్ద అసెట్ అవుతుందని’ ఆది తెలిపాడు. ఆది సరసన ఆద శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మదన్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు