‘కబాలి’ మలేషియా షెడ్యూల్‌కు రాధికా ఆప్టే..!

‘కబాలి’ మలేషియా షెడ్యూల్‌కు రాధికా ఆప్టే..!

Published on Feb 8, 2016 11:41 PM IST

radhika-apte
‘కబాలి’.. రజనీ కాంత్ హీరోగా, తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ తెరకెక్కిస్తోన్న గ్యాంగ్‌స్టర్ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన అంచనాలు బయలుదేరాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. రజనీ సహా ప్రధాన తారాగణం పాల్గొంటుండగా 20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో రాధికా ఆప్టే నిన్ననే జాయిన్ అయ్యారు.

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రత్యేక తరహా పాత్రల్లో మెప్పిస్తూ వస్తోన్న రాధికా, ఈ సినిమాలో రజనీ భార్యగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్, పోస్టర్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు రేకెత్తించాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండనుందని దర్శక నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. మే 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు