మహేశ్ సినిమాలో యువహీరో కీలకపాత్ర!

మహేశ్ సినిమాలో యువహీరో కీలకపాత్ర!

Published on Mar 5, 2015 6:10 PM IST

Mahesh-Rahul-Ravindran
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో ఓ యువ హీరో కీలక పాత్ర పోషించనున్నారు. ‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’ చిత్రాల ఫేం రాహుల్ రవీంద్రన్ మహేశ్ సినిమాలో నటించనున్నారు. సినిమాలో కీలకమైన ఓ పాత్రకు రాహుల్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు కొరటాల శివే ట్విట్టర్ ద్వారా తెలిపారు.

యువహీరో, ప్రతిభా శాలి రాహుల్ రవీంద్రన్ తమ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సినిమాలోని ఓ కీలక పాత్రలో మహేశ్ సరసన ఆయన నటించనున్నారని తెలిపారు. మైత్రి మూవీస్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాలో మహేశ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు