ఇంటర్వ్యూ: రాజ్ కందుకూరి – ఇది అందరికీ కనెక్ట్ అయ్యే ఒక కామన్ బాయ్ కథ !

ఇంటర్వ్యూ: రాజ్ కందుకూరి – ఇది అందరికీ కనెక్ట్ అయ్యే ఒక కామన్ బాయ్ కథ !

Published on Jan 27, 2020 4:31 PM IST

శివ కందుకూరి హీరోగా శేష్ సింధూ రావ్ దర్శకత్వంలో రానున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. ఇక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకురుస్తుండగా.. రాజ్ కందుకూరి ఈ సినిమాని నిర్మించారు. ఈ సంధర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సినిమా గురించి ఆయన ఆసక్తికరమైన విశేషాలు చెప్పుకొచ్చారు.

 

మీరు ఎక్కువుగా కొత్త వాళ్లతోనే సినిమాలు చేస్తున్నారు ?

కొత్త వాళ్లతో ఎందుకు చెయ్యకూడదు. ఆడియన్స్ మంచి సినిమాని చూడటానికి ఎప్పుడూ రెడీగా ఉన్నారు. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే అదే 150 రూపాయిల టికెట్ తో సినిమా చూస్తున్నారు. అందుకే మంచి కంటెంట్ తో వచ్చే టాలెంట్ ఉన్న కొత్త వాళ్లతో సినిమాలు చేస్తున్నాను.

 

మీరు ఇప్పటివరకూ మీ సినిమాల ద్వారా చాలమంది కమెడియన్స్ తో పాటు టెక్నీషియన్స్ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ?

అవును. ఈ విషయంలో నేను ఈ రోజు గర్వంగా చెప్పుకోగలను. ఏ షూటింగ్ కి వెళ్లినా ఆక్కడ నా సినిమాల ద్వారా పరిచయం అయిన వాళ్ళు కనీసం ఒక్కరో ఇద్దరో ఉంటున్నారు. వాళ్ళు నా మీద చూపించే ప్రేమ నాకు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా ఆ ఆనందానికి సరితూగదు.

 

‘చూసీ చూడంగానే’ సినిమా గురించి ?

నేను ప్రతి సంవత్సరం ఒక డైరెక్టర్ ను లాంచ్ చేస్తున్నాను. ఈ సారి ఒక లేడి డైరెక్టర్ ను పరిచయం చేద్దామనుకున్న సమయంలో.. శేష్ సింధూ రావ్ వచ్చి ఒక మంచి కథ చెప్పింది. ఆమె చేసిన చిన్న షార్ట్ ఫిల్మ్ చూసి ఈ సినిమా ఆమె డైరెక్ట్ చేయగలదని నాకు నమ్మకం కలిగింది. అలా ఈ సినిమా మొదలైంది.

 

శివ కందుకూరి మీ అబ్బాయి అని ఈ సినిమాలో హీరోగా తీసుకున్నారా ?

లేదు అండి. డైరెక్టర్, హీరో కోసం ఆడిషన్స్ తీసుకుంటున్న క్రమంలో.. మా అబ్బాయి గురించి ఆమెకు తెలిసింది. శివని కూడా ఆడిషన్ చేస్తానని దాదాపు 12 రోజులు వరుసగా ఆడిషన్ చేసింది. ప్రతి సీన్ ఎలా చేస్తే బాగుంటుందని తన చేత చేయించింది. ఈ కథలో హీరో క్యారెక్టర్ కి శివ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని డైరెక్టర్ నమ్మినందుకే అతన్ని హీరోగా తీసుకోవడం జరిగింది.

 

సినిమా లెంగ్త్ చాల క్రిస్పీగా ఉందట ?

సినిమా గురించి సురేష్ బాబుగారితో మాట్లాడినపుడు సినిమా లెంగ్త్ ను ఇంకా తగ్గిస్తే బాగుంటుందని ఫీల్ ఆయ్యాం. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ఎక్కడా ప్లో మిస్ కాకుండా.. గంట ఏభై మూడు నిమిషాలే ఉంటుంది.

 

సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అంశాలు ఏమిటి ?

స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఈ సినిమాలో కంటెంట్ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఒక కామన్ బాయ్ కథ. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది.

 

సినిమా చూశాక శివ నటన గురించి మీరెలా ఫీల్ అయ్యారు ?

ఒక తండ్రిగా చెప్పట్లేదు. శివ చాల ఈజీతో చేశాడు, సినిమాలో తన నటన చూశాక తనకు మూడు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ కూడా అయి అది కూడా రిలీజ్ కి రెడీ అవుతొంది.

 

మీ తదుపరి సినిమా గురించి ?

ప్రతి సంవత్సరం మా బ్యానర్ లో ఒక సినిమా చేస్తాను. తరువాత సినిమా ఏప్రిల్ నుండి మొదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు