టీజర్ : మరో ఇంటరెస్టింగ్ సినిమాతో రాజ్ తరుణ్!

టీజర్ : మరో ఇంటరెస్టింగ్ సినిమాతో రాజ్ తరుణ్!

Published on Dec 11, 2016 4:58 PM IST

raj-tarun
వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువహీరో రాజ్ తరుణ్, ‘ఈడో రకం ఆడో రకం’ లాంటి మంచి సమ్మర్ హిట్ తర్వాత మూడు కొత్త సినిమాలతో సిద్ధమవుతున్నారు. ఈ మూడు సినిమాల్లో ఒకటైన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమా మొదట్నుంచీ మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా కొద్దిసేపటి క్రితం విడుదలైన ఫస్ట్ టీజర్ కూడా అదే రేంజ్‌లో ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో కుక్కలను కిడ్నాప్ చేసే ఓ పాత్రలో రాజ్ తరుణ్ కనిపిస్తారట. ఇదే విషయాన్ని పరిచయం చేస్తూ వచ్చిన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కుక్కల్ని కిడ్నాప్ చేశాక వందనోట్లు ఇస్తే ఫర్వేలేదు, 500, 1000 నోట్లిస్తే మాత్రం బాగోదు అంటూ ప్రస్తుతం సమాజంలో హాట్ టాపిక్ అయిన కరన్సీ బ్యాన్‌ను కూడా టచ్ చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, అను ఎమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు రాజుగాడు, అందగాడు అన్న రెండు సినిమాలను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నారు రాజ్ తరుణ్!

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు