కొత్త సినిమా ప్రారంభానికి సిద్దమవుతున్న రాజ్ తరుణ్ !

యంగ్ హీరోల్లో మంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న నటుల్లో రాజ్ తరుణ్ కూడా ఒకరు. వరుస విజయాలతో నిర్మాతలకి మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు రాజ్ తరుణ్. ఆయన చివరి చిత్రాలు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు’ వంటివి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకోవడంతో ఆయన తర్వాతి చిత్రం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఇలాంటి తరుణంలోనే ఆయన ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుండో అనుకుంటున్నదే అయినా చాలా రోజుల చర్చ తర్వాత ఇప్పుడు మొదలుకానుంది. ఈ మనగలవారం అనగా 24వ తేదీన ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది, నటీనటులెవరు, టైటిల్ ఏమిటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే నూతన దర్శకురాలు సంజన రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ చేస్తున్న మరొక చిత్రం ‘రాజు గాడు’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

 

Like us on Facebook